కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఎంత పెద్ద హీరో అయినా తమ సినిమాను రిలీజ్ చేయడానికి భయపడ్డారు. కానీ ఇవేమీ పట్టించుకోని నందమూరి నట సింహం బాలకృష్ణ తను నటించిన సినిమా ని విడుదల చేశాడు.అయితే మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ముచ్చట గా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు ఈ సినిమాకు స్టోరీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్.... అయితే.. ఈ సినిమా లో ఫస్ట్ టైం బాలయ్య అఘోరగా కనిపించడం.. ఇక ఆ పాత్రకోసం ఆయన చేసుకున్న బాడీ మాడ్యూలేషన్స్..చెప్పే ప్రతి డైలాగ్ అభిమానులకు బాగా రీచ్ అయ్యింది.అయితే దీంతో ఈ సినిమాతో బాలయ్య..బ్లాక్ బస్టర్ హిట్ అందుకొవడమే కాకుండా..
కెరీర్ లోనే ఫస్ట్ టై ఈ సినిమా ద్వారా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు.అయితే ఇక ప్రజెంట్ బాలయ్య గొపీచంద్ మల్లినే డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించనున్నారని..ఇప్పటికే ఓ న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా..బాలయ్య ఢీ కొట్టే పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. తాజాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇకపోతే ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య అనీల్ రావిపూడితో మరో సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఇక ఇప్పటి వరకు తాను చేయని ఢిఫరెంట్ స్టోరీతో బాలయ్యతో సినిమా చేస్తున్నాని ఇదివరకే ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు అనిల్.
ఇకపోతే ఈ సినిమా తరువాత మళ్ళీ బాలయ్య తన లక్కి డైరెక్టర్ బోయపాటి శ్రీను తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఇప్పటికే బాలయ్యతో బోయపాటి మూడు సినిమాలు తెరకెక్కించాడు.కాగా మూడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో నాలుగవ సినిమా రాబోతుందని తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటిదాకా బోయపాటి డైరెక్షన్ లో చేసిన ప్రతి సినిమా బాలకృష్ణ కి మర్చిపోలేని హిట్ గా మారింది. కాగా దీంతో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని బాలయ్య భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం బోయపాటి కూడా రామ్ పోతినేని తో ఒక సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కంప్లిట్ అయ్యాక బాలయ్య తో సినిమా పై అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.