రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా మార్చ్ 11 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయ్యింది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది , ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ 'బాహుబలి' తర్వాత సాహో , రాధే శ్యామ్ సినిమాలో హీరో గా నటించాడు, ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలలో సాహో సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన పటికి టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశ పరిచింది, రాధే శ్యామ్ మూవీ మాత్రం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా నిరాశ పరిచింది.
ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్ , ప్రాజెక్ట్ కే , ఆది పురుష్ సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు రాధే శ్యామ్ మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాడ్ విశ్రాంతి అనంతరం సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా లతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కబోయే స్పీరిట్ మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.