తెలుగు సినిమా పరిశ్రమలోని చిత్రాలు ఇతర భాషలలోకి వెళ్లి రీమేక్ అవుతూ ఉండటం నిజంగా తెలుగువారి కి ఎంతో గర్వకారణం అని చెప్పాలి. మన సినిమాలు ఇతర భాషల లోకి వెళ్లి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నాయి అంటే మన తెలుగు వారిలో టాలెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా చూస్తే తెలుగు సినిమా పరిశ్రమలోకే ఎక్కువగా రీమేక్ సినిమాలు తెరకేక్కడం జరుగుతుంది. ఈ విధమైన మార్పు జరగడం వెనుక కారణం ఏమిటో తెలియదు కానీ ఒక భాషలో సూపర్ హి ట్ అయిన సినిమాలు మళ్లీ తెలుగులో చేయడానికి సదరు దర్శక నిర్మాతలు మరియు హీరోలు ఇష్టపడుతున్నారు.
ఈ విధంగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 2 రీమేక్ సినిమాలను తెలుగులో చేస్తూ ఉండగా ఇతర హీరోలు కూడా కొంతమం ది రీమేక్ సినిమాలపై మనసు పడడం విశే షం. పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేయడం నిజంగా అందరి ఆలోచన మారడానికి కారణం అని చెప్పవచ్చు. అగ్రహీరో లు చిన్న హీరోల నే కాదు కొత్త గా వచ్చే హీరోలు సైతం కూడా ఈ విధమైన సినిమాలను చేసి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. దీన్నిబట్టి తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేటివిటీ ఎంతటి స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో కొన్ని తెలుగు సినిమాలు ఇతర భాషలలో అవుతూ ఉండటం మనం చూస్తున్నాం. అయితే మన సినిమాలు ఒకటో రెండో రీమేక్ అవుతూ ఉంటే మన తెలుగు లో ఇతర భాషల నుంచి రీమేక్ అవుతున్న సినిమాలు అరడజను కు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ లో డైరెక్ట్ సినిమాలు వస్తే బాగుంటుంది అన్న ఆలోచన విశ్లేషణ సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.