రాజమౌళి అగ్రిమెంట్ ను బ్రేక్ చేసిన అమీర్ ఖాన్.. కారణం..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తాజాగా తెరకెక్కించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఏ రేంజ్ లో దూసుకుపోతోందో మనం అర్థం చేసుకోవచ్చు.  ఇకపోతే ఎన్టీఆర్ , రామ్ చరణ్ కీలక పాత్రలు పోషిస్తూ ఏకంగా రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో డీ వీ వీ  ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఇకపోతే బుధవారం ముంబైలో సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్,  కరణ్ జోహార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక వీరందరూ రామ్ చరణ్ , ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు రాజమౌళి వర్కింగ్ స్టైల్ పై  ప్రశంసల వర్షం కురిపించారు.

భారీ విజయాన్ని అందుకున్నందుకు చిత్రం యూనిట్ కు అభినందనలు కూడా తెలిపారు. రాజమౌళి గురించి మాట్లాడుతూ అమీర్ ఖాన్ పై షాకింగ్ కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ కి.. నాకు మధ్య ఒక ఒప్పందం.. ఇక ఆ ఒప్పందం ఏమిటి అంటే కేవలం పేర్లు పెట్టి మాత్రమే పిలుచుకోవాలని సార్,  గారు అనే  పదాలు ఉపయోగించుకో కూడదు అని ఇటీవల ఒక అగ్రిమెంట్ కూడా మేం పెట్టుకున్నాము. అయితే అమీర్ ఖాన్ ని సార్ అని కాకుండా ఏకే అని పిలవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను..

ఇక అమీర్ ఖాన్ ఒత్తిడి చేయడంతో నేను ఆయనను ఏకే అని పిలవడం మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు ఆయన మాత్రం మా మధ్య ఉన్న అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు..అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.ఇక దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: