త్రిబుల్ ఆర్ కి.. మరో అర్థం చెప్పిన జబర్దస్త్ కమెడియన్స్?
మొదట త్రిబుల్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకు ఆ టైటిల్ చివరి వరకు కొనసాగింది. త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి,రామ్ చరణ్,రామారావు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక రాజమౌళి త్రిబుల్ ఆర్ కొత్త అర్థం చెప్పాడు అన్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అంటూ చెప్పాడు. ఇకపోతే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం బుల్లితెరపై స్పూఫ్ చేస్తున్నారు. ఇక ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ త్రిబుల్ ఆర్ సినిమా కి కొత్త అర్థాన్ని చెప్పారు.
ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రోమోలో భాగంగా ఒక స్కిట్ లో త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించి గెటప్ లతో ఎంట్రీ ఇస్తారు అందరు. అంతేకాదు త్రిబుల్ ఆర్ లో ఉన్న కొన్ని డైలాగులు కూడా చెబుతూ ఉంటారు. ఇంతలోనే త్రిబుల్ ఆర్ అంటే ఏంటి అంటూ అడుగుతాడు కమెడియన్ నరేష్. ఇంతలోనే నూకరాజు త్రిబుల్ ఆర్ కి కొత్త అర్థాన్ని చెబుతాడు. హీరోలు చేస్తే రౌద్రం రణం రుధిరం.. ఇక్కడ వీళ్ళు చేసేది మాత్రం రాడ్డు రోత ర్యాంపు అంటూ చెబుతాడూ. దీంతో అక్కడున్న వారందరూ కూడా పగలబడి నవ్వుకుంటారు..