టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ ఏ  రేంజ్ లో పెరిగిపోయిందో మన అందరికీ తెలిసిందే,  బాహుబలి సినిమా విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించినప్పటి నుండి తెలుగు సినిమా రేంజ్ అమాంతం పెరిగి పోయింది. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్ప సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని సాధించింది, పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజిలో కలెక్షన్ లను  కూడా బాగానే రాబట్టింది.  తాజాగా తెలుగు నుండి వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ  కూడా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది,  టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయలను  సాధించడంతో ప్రస్తుతం ఎన్నో సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీ లుగా తెరకెక్కుతున్నాయి.  


ఇది ఇలా ఉంటే ఎంతోమంది  బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు,  అందులో భాగంగా  ఇప్పటికే కియారా అద్వానీ టాలీవుడ్ లో భరత్ అనే నేను , వినయ విధేయ రామ సినిమాలలో నటించింది,  ప్రస్తుతం కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన  ఒక సినిమాలో నటిస్తోంది.  ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ లో కొనసాగుతున్న ఆలియా భట్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించింది, అలాగే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో నటించబోతోంది.  ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి మంజ్రేకర్ 'గని'  సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది,  ఇది ఇలా ఉంటే వీరితో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ మూవీతో అనన్య పాండే కూడా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతోంది,  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ తో దీపిక పదుకొనె కూడా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది,  ఇలా బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్  పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: