అటు అల్లు అర్జున్... ఇటు షారుక్ ఖాన్... ఇద్దరితో ప్లాన్ చేస్తున్న మురుగదాస్..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో మురగదాస్ ఒకరు,  మురుగదాస్ తమిళ ఇండస్ట్రీ లో అనేక హిట్ , సూపర్ హిట్ ,  బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి తమిళ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.  తమిళ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మురుగదాస్ తెలుగులో నేరుగా స్టాలిన్ , స్పైడర్ సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు,  ఇది ఇలా ఉంటే మురుగదాస్ తమిళం లో దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలను తెలుగు లో డబ్ చేసి తెలుగులో విడుదల చేసి కూడా మురగదాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విజయాలను అందుకున్నాడు,  కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా మురుగదాస్ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకున్నాడు.


 ఇది ఇలా ఉంటే మురగదాస్ కొంత కాలం క్రితం రజనీ కాంత్ హీరోగా దర్బార్ సినిమాను తెరకెక్కించాడు,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ఇది ఇలా ఉంటే  మురుగదాస్,  సల్మాన్ ఖాన్ కు ఒక కథ చెప్పినట్టు ఆ ప్రాజెక్ట్ జర్ కానట్లు తెలుస్తుంది,  ఇది ఇలా ఉంటే అదే కథను షారుక్ ఖాన్ కు మురుగదాస్ వివరించినట్టు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్లు తెలుస్తోంది.  అలాగే మురుగదాస్ తెలుగులో కూడా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది,   అల్లు అర్జున్ తో స్టోరీ సెట్టింగ్స్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.  అల్లు అర్జున్ కూడా మురగదాస్ తో సినిమా చేయడానికి పాజిటివ్ గానే  ఉన్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే మురుగదాస్ బాలీవుడ్ లో మూవీ చేస్తే అది షారుక్ ఖాన్ తో చేయనున్నట్లు,  టాలీవుడ్ లో మూవీ  చేస్తే అల్లు అర్జున్ తో  చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: