ఎఫ్ 3 పై ఆలోచనలను మార్చుకున్న తమన్నా !

Seetha Sailaja

ప్రస్థుతం తమన్నా మార్కెట్ ఏమాత్రం బాగాలేదు. దీనితో ఆమె దృష్టి అంతా వెబ్ సిరీస్ పైనే ఉంది. యంగ్ హీరోయిన్స్ పూజా హెగ్డే రష్మిక ల హవా మొదలైన తరువాత తమన్నాకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ఆమె నటిస్తున్న ‘ఎఫ్ 3’ విజయవంతం అయితే మళ్ళీ ఆమెకు అవకాశాలు వస్తాయని ఆమె భావిస్తోంది.


ఈ పరిస్థితుల మధ్య తమన్నాకు ‘ఎఫ్ 3’ యూనిట్ కు మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అని వస్తున్న గుసగుసలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ గాసిప్ ప్రకారం ‘ఎఫ్ 3’ షూటింగ్ సమయంలో తమన్నా ఆమూవీ షూటింగ్ సమయానికి అనుకున్న సమయానికన్నా బాగా లేట్ గా రావడంతో ఈమూవీ యూనిట్ కు సంబంధించిన కీలక వ్యక్తి తమన్నాను ఈవిషయమై ప్రశ్నించడంతో ఆమెకు అసహనం కల్గిందని దానితో అంటీముట్టనట్లుగా ఉంటూ ఆమూవీ షూటింగ్ పూర్తి చేసిందని అన్నమాటలు వినిపిస్తున్నాయి.


ఇప్పుడు ‘ఎఫ్ 3’ విడుదల తేదీ దగ్గర పడుతున్న పరిస్థితులలో ఈమూవీకి సంబంధించిన ఒక ప్రమోషన్ సాంగ్ ను షూట్ చేసి విడుదల చేయాలి అన్న ఆలోచనలలో నిర్మాత దిల్ రాజ్ అనీల్ రావిపూడి ఉన్నట్లు టాక్. అయితే ఇప్పుడు తమన్నాకు ‘ఎఫ్ 3’ యూనిట్ తో ఏర్పడిన ఈ గ్యాప్ రీత్యా ఆమె ఆ ప్రమోషన్ సాంగ్ షూటింగ్ కు ఎంత వరకు సహకరిస్తుంది అంటూ కొందరు ఊహాగానాలు మొదలు పెట్టారు.


అయితే తమన్నా వర్క్ విషయంలో చాల ప్రొఫిషనల్ గా ఉంటుంది. ఎవరితోను  ఆమె వివాదాలు పెట్టుకున్న సందర్భాలు గతంలో లేవు. అందువల్ల ఎదో ఒక కారణం వల్ల ఏర్పడిన ఆ చిన్న గ్యాప్ ను మరింత పెంచుకుంటూ ‘ఎఫ్ 3’ ప్రమోషన్ కు రాకుండా ఉంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆమె కెరియర్ కు ఎండ్ కార్డు పడుతుంది కాబట్టి తెలివైన తమన్నా ఇలాంటి పని చేయదు అని ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయం..  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: