క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయబోతున్న అనిల్ రావిపూడి..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది,  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కంటే ముందు తెలుగు ఇండస్ట్రీలో మరీ తక్కువగా ఉన్న మల్టీస్టారర్ సినిమాల జోరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయం సాధించడంతో మల్టీస్టారర్ సినిమాల జోరు విపరీతంగా పెరిగిపోయింది.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి,  అందులో కొన్ని మంచి విషయాలను సాధిస్తే మరి కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  కొన్ని రోజుల క్రితం విడుదలైన  భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,  దగ్గుబాటి రానా కలిసి నటించారు,  ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కించాడు.


  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను సాధిస్తూ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది, ప్రస్తుతం కూడా ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు,  ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వినోదాయ సితం సినిమాని తెలుగులో రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది,  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల జోరు ఫుల్ గా పెరిగిపోయింది,  ఇది ఇలా ఉంటే దర్శకుడు అనిల్ రావిపూడి , బాలకృష్ణ హీరో గా  సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే.   ఈ సినిమాను మల్టీస్టారర్ జోనర్ లో తెరకెక్కించడానికి అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు రవితేజ ను కూడా నటింపచేయడానికి దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇలా అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: