ఓటీటీ లోకి నిఖిల్ కొత్త సినిమా..?

Anilkumar
ప్రస్తుతం యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.అయితే  ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఇకపోతే ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తీ చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు.ఇకపోతే ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అయితే అందులో సుకుమార్ నిర్మిస్తున్న ’18పేజిస్‌’, ‘కార్తికేయ-2’ లు షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇక  వీటితో పాటు ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే గతేడాదే ఈ సినిమాపై ప్రకటన వచ్చింది.


ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.అయితే సుధీర్‌బాబు, నిఖిల్ కాంబోలో తెరకెక్కబోయే ఈ హ్యట్రిక్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్ర మేకర్స్ పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా చివరికి ‘జీ-5’ సంస్థతో భారీ డీల్‌ను కుదిరించుకుందని సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే గతంలో ఈ కాంబోలో తెరకెక్కిన ‘స్వామిరారా’, ‘కేశవ’ చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి.


ఇక ఇదిలా ఉంటే సుధీర్ వర్మ లేటెస్ట్‌గా తెరకెక్కించిన ‘శాకినీ ఢాకినీ’ చిత్రం కూడా నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అయితే సుధీర్ వర్మ ప్రస్తుతం మాస్‌రాజ రవితేజతో ‘రావణాసుర’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో రవితేజ తో పాటు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా కూడా పాల్గొంది. ఇక ఈ సినిమాలో రవితేజకి జోడిగా ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందులో ఓ హీరోయిన్ రవితేజ కు విలన్ గా కనిపించబోతోందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: