'బీస్ట్' ప్రెస్ మీట్ లో డ్యాన్స్ ఇరగదీసిన పూజాహెగ్డే.. వీడియో..
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'.. సరి కొత్త కథ తో విజయ్ ఎప్పుడూ కనిపించని విధంగా విజయ్ ఈ సినిమా లో నటిస్తూన్నారు. విజయ్ సరసన జోడిగా బ్యూటీఫుల్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తుంది.ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాను జనాల్లొకి తీసుకెల్లాలని చిత్రయూనిట్ భారీగా ప్రమోషన్స్ ను చేస్తున్నారు..
మరోవైపు సినిమా పై నిషెధించాలని విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిత్రంలో ఇస్లాంవాదులను తీవ్రవాదులుగా చిత్రీకరించారంటూ తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా 'బీస్ట్'ను తమిళనాడులో సైతం నిషేధించాలంటూ డిమాండ్ చేశాడు.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సినిమా ప్రమోషన్స్ ను మాత్రం చిత్రయూనిట్ ఆపలేదు..ఈ సినిమా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ జనాలను మరింత ఆకట్టుకుంటోంది. అందులో హబీబీ పాటకు పూజాహెగ్డే వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ నెల 14 న సినిమా విడుదల కానుంది..