మంచి మనసు చాటుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్.. వాళ్ళ కోసం స్పెషల్ షో..!

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సారి హీరోగా కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

ముఖ్యంగా సినిమాలో అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్.. కొమరం భీం గా ఎన్టీఆర్ నటన అదిరిపోయిందని, రాజమౌళి టేకింగ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా త్రిబుల్ ఆర్ చిత్రబృందం మంచి మనసు చాటుకుంది. తాజా సమాచారం ప్రకారం అనాధ పిల్లల కోసం నేడు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ షో ని ఏర్పాటు చేయనుంది చిత్ర యూనిట్. అంతేకాదు దర్శకధీరుడు రాజమౌళి తో పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరు కాబోతున్నారు. ఇక అనాధ పిల్లల కోసం త్రిబుల్ ఆ చిత్ర బృందం స్పెషల్ షో ఏర్పాటు చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది..

 కాగా పాన్ ఇండియా  స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్లుగా నటించారు. ఇక వీరితో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 350 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం అటు హిందీ వెర్షన్ లోనూ భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఈ చిత్రం రెండు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తర్వాత విడుదలైన చిత్రాల్లో రెండు వందల కోట్ల మార్కును చేరుకున్న రెండవ చిత్రంగా త్రిబుల్ ఆర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: