ఇక పాండమిక్ టైం లో ఓ చిట్ చాట్ సెషన్ లో తెలుగు నుంచి ఇష్టమైన హీరోగా మహేష్ బాబు పేరు చెప్పిన మీరా చొప్రా.. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తనకు అసలు ఎవరో తెలియదని.. తాను అతని ఫ్యాన్ ను కాదని ఆమె పేర్కొంది.టాలీవుడ్ టాప్ 5 స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మీరా చోప్రా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ అప్పుడు ట్రోల్ పెద్ద ఎత్తున చేశారు. తారక్ ఫ్యాన్స్ తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించడం అప్పట్లో నేషనల్ వైడ్ గా పెద్ద హాట్ టాపిక్ అయింది.దీనిపై మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయమహిళా కమిషన్ కి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే లేపిందని చెప్పాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు అంతా కూడా సైలెంట్ అయిపోయారు.
అయితే తాజాగా మీరా చోప్రా పరోక్షంగా మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ ఓ ట్వీట్ చేయడం నెట్టింటా చర్చనీయాంశంగా మారింది.ఈ మధ్య కాలంలో సౌత్ స్టార్స్ అంతా కూడా జాతీయ స్థాయిలో రాణిస్తున్న నేపథ్యంలో మీరా చోప్రా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ''సౌత్ ఇండియా స్టార్స్ అందరూ కూడా పాన్ ఇండియా గుర్తింపు పొందడం చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వారి ప్రతిభ ఇంకా వారి వినయం వారి అభిరుచి నుండి ఎంతో నేర్చుకోవాలి. ప్రభాస్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్ - యష్ లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది'' అని ఆమె ట్వీట్ లో పేర్కొంది. అయితే ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ పేరు లేకపోవడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఫైర్ అవుతున్నారు.ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో నటించింది.