బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ రియాల్టీ షో మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యింది, హిందీ లో ఎంతో మంది ప్రేక్షకులను బిగ్ బాస్ రియాలిటీ షో అలరిస్తూ రావడంతో బిగ్ బాస్ రియాలిటీ షో లను దేశంలో ఉన్న చాలా లాంగ్వేజ్ లలో ప్రారంభించారు, ఇందులో భాగంగా బిగ్ బాస్ రియాల్టీ షో ను తెలుగులో కూడా ప్రారంభించారు, బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో మొదటి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు, ఆ తర్వాత మూడవ , నాలుగవ , ఐదవ సీజన్ లకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' నాన్ స్టాప్ ప్రసారం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ బిగ్ బాస్ రియాల్టీ షో 'ఓ టి టి' కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ రియాల్టీ షో 'ఓ టి టి' లో ఇప్పటి వరకు కొంత మంది సభ్యులు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు, ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షో 'ఓ టి టి' విజయవంతంగా రన్ అవుతుంది. ఇంటి సభ్యుల మధ్య కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి, ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' లో తాజాగా నటరాజ్ మాస్టర్ కు యాంకర్ శివ కు మధ్య పెద్ద ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది, కొట్టకపోతే అడుగు అంటూ శివ కు సవాలు విసిరాడు నటరాజ్ మాస్టర్. యాంకర్ శివ , నటరాజ్ మాస్టర్ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్తుండటంతో వీరి కొట్లాటను ఆపే ప్రయత్నం చేసింది కెప్టెన్ అషూ. కోపంతో ఉన్న నటరాజ్ మాస్టర్ కిచెన్ లో కూడా తన కోపాన్ని చూపించాడు, నాకు రక్తం మరిగిపోతుంది, ఎన్ని సార్లు ఊరుకుంటాను, కత్తి తెచ్చి కట్ చేసి పాడేద్దామనుకున్నాను అని కోపంతో రగిలిపోయాడు. చివరకు మనిషికి రెండు కళ్లు, శివుడికి మూడు కళ్లు, నటరాజ్ కు ఒళ్లంతా కళ్లు అన్న తనదైన స్టైల్‌లో నటరాజ్ మాస్టర్ డైలాగ్ వదిలాడు, ఇలా బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' ఇటు గేమ్ లతో అటు గొడవలతో సాగిపోతుంది.