మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దం అయ్యింది. ఈ నెల 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమాను తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.ఇక సినిమా ప్రారంభం అయ్యి రెండేళ్లకు పైగానే అయ్యింది. కరోనా వైరస్ వల్ల ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎంత ఆలస్యం అయినా కాని అంచనాలు ఇసుమంత అయినా కూడా తగ్గలేదు.మెగాస్టార్ చిరంజీవి రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అక్కడ మంచి గుర్తింపును దక్కించుకున్న రామ్ చరణ్ ఉండటం వల్ల ఆచార్య సినిమాకు మంచి బజ్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా రిలీజ్ కు మరో రెండు వారాల సమయం ఉంది. అయితే ఇప్పటి దాకా సినిమాకు సంబంధించిన హడావుడి మొదలు కాలేదు. ఈనెల 12వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది.
ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఖచ్చితంగా హడావుడి ఉంటుందనే నమ్మకం ను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీడియా సర్కిల్స్ లో మాత్రం విభిన్నంగా ప్రచారం జరుగుతుంది.ఇప్పటి దాకా అపజయం అనేది తెలియని కొరటాల శివ తన సినిమాలను ఎక్కువ ప్రమోట్ చేయడం కంటే కూడా తన సినిమాలు విడుదల అయిన తర్వాత మౌత్ టాక్ తో ప్రమోట్ అయ్యేలా చేసుకుంటాడు అని గతంలో నిరూపితం అయ్యింది. ఈమద్య కాలంలో ఆర్ ఆర్ ఆర్ ఇంకా కేజీఎఫ్ 2 కు ఎంత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారో మనం చూశాం. ఈ సినిమాకు కూడా అలాగే చేయాల్సి ఉందంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రెగ్యులర్ సినిమాలకు చేసినట్లుగా ఆచార్య సినిమాకు ప్రమోషన్ చేస్తే కుదరదు అంటూ మీడియా వర్గాల వారిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆచార్య సినిమా కు మంచి బజ్ అనేది ఉంది. పైగా ఆర్ ఆర్ ఆర్ స్టార్ అయిన రామ్ చరణ్ ఈ సినిమా లో నటించడం వల్ల అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా మంచి బజ్ ఉంది. కనుక ఇంకాస్త ప్రమోషన్ చేస్తే తప్పకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మీడియా వారిలో నడుస్తున్న చర్చ.