పవన్ వ్యూహాలలో మార్పులు !

Seetha Sailaja
ఎంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికీ రెండు పడవల ప్రయాణం చాల కష్టం. అయితే అలాంటి ప్రయాణాన్ని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ అటు సినిమాలను ఇటు రాజకీయాలను సమాంతరంగా నడిపిస్తూ అనునిత్యం వార్తలలో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. పవన్ నటిస్తున్న సినిమాల లిస్టు రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే సినిమాలు ఎనౌన్స్ అయినంత వేగంగా పవన్ సినిమాలు పూర్తి కావడంలేదు.


దీనితో పవన్ పై ఆశలు పెట్టుకున్న దర్శక నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈలిస్టులో హరీష్ శంకర్ చాలముందు వరసలో ఉన్నాడు. ‘గబ్బర్ సింగ్’ లాంటి భారీ బ్లాక్ బష్టర్ తీసిన హరీష్ శంకర్ కు మరో బ్లాక్ బష్టర్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలని కోరిక. ఆ కోరికను తీర్చడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి అతడితో ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీకి లైన్ క్లియర్ చేసి ఆ లైన్ క్లియర్ చేసినప్పటికీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో హరీష్ శంకర్ కే తెలియని పరిస్థితి ఏర్పడటంతో అతడు పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.



ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ దర్శకుడు హరీష్ శంకర్ నీ అదేవిధంగా ఈ మూవీ నిర్మాతలను తన ఇంటికి పిలిచి మాట్లాడిన సందర్భంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ త్వరలో రాబోతోంది అంటూ ఈ మూవీ నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీ త్వరలో పట్టాలు ఎక్కుతుంది అన్నసంకేతాలు వస్తున్నాయి.



అయితే ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ కు తన డేట్స్ ను వరసగా నాలుగు నెలలు ఇచ్చాడు అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ఈ మూవీని చేస్తూనే పవన్ హరీష్ శంకర్ మూవీని కూడ ప్రారంభిస్తాడా అన్న సందేహాలు కల్గుతున్నాయి. అదే నిజం అయితే సముద్రఖని దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమా ఎప్పుడు అన్న సందేహాలు రావడం సహజం. మధ్యలో ‘జనసేన’ రాజకీయాలు ఇలాంటి టెన్షన్ ల మధ్య పవన్ రానున్న రోజులలో ఒక్క సినిమా అయినా వేగంగా పూర్తి చేయగలడా అన్న సందేహాలు చాలామందికి కల్గుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: