వన్ ఉమెన్ షో.. స్పై థ్రిల్లర్ గా కంగనా ఉగ్రరూపం..
రజ్నీష్ ఘాయ్ గహై దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ `ధాకడ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కంగన మరో అద్భుతం చెస్తుందనె అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఆమె చేసిన యాక్షన్ సినిమాలు మంచి హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సినిమా ఫుల్ యాక్షన్ ను చూపిస్తున్నారు.భారీ యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాలో ప్రధాన అస్సెట్ గా నిలుస్తాయని ఆ మధ్య కంగన ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇవ్వడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి..
ఆ అంచనాలను రెట్టింపు చెసెందుకు మేకర్స్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఈ టీజర్ లో ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలతో కంగనా రనౌత్ అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చింది.ఒక నిమిషం 21 సెకన్లు నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా కట్ చేశారు..స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధాకడ్ టీజర్ లో ప్రతి సీన్ కూడా గగుర్పాటుతో కలిగిన సన్నీవేశాలను కలిగి వుంది.. కంగన కత్తి పోట్లు కూడా అందరినీ ఆకర్షించింది. మొత్తానికి ఈ సినిమా తో కంగనా రేంజ్ పూర్తిగా మారిపోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా ఎ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి..