కే జి ఎఫ్ డైరెక్టర్ కు ఆ మెగా హీరో అంటే చాలా ఇష్టమట..!!
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు రాష్ట్రాలలో ప్రెస్ మీట్ లో మాట్లాడడం కూడా జరిగింది. అలా తిరుపతిలో కూడా మాట్లాడటం జరిగింది. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉందని.. తను చిన్న వయసు నుంచే చిరంజీవి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యా అని మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి చిత్రంలో చూసినటువంటి కొన్ని సీన్స్, ఎలివేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయని తెలిపారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక అలాంటి వాటినే తాను కూడా సినిమాలలో ఉపయోగిస్తూ ఉంటానని తెలిపారు. అందుచేతనే ప్రేక్షకులు కూడా వాటిని చూసి ఎంతో అద్భుతంగా ఉంటాయి అని చెబుతూ ఉంటారు అని తెలిపారు.
తనని తన చిన్నవయసులోనే వచ్చే చిరంజీవి సినిమాలోని సన్నివేశాలు బాగా ప్రభావితం చేశాయని తెలిపారు ప్రశాంత్ నీల్. అందుచేతనే తను తెరకెక్కించే సినిమాలో ఎక్కువగా చిరంజీవి లాగా ఉండే విధంగా హీరోలను చూపిస్తూ ఉండాలని తెలిపారు డైరెక్టర్. ఏది ఏమైనా డైరెక్టర్ చిరంజీవి గురించి మాట్లాడడం తో ఆయన అభిమానులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా రాబోయే రోజుల్లో చిరంజీవితో కలిసి కూడా సినిమా తీయబోతున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. వాదన కూడా వినిపిస్తోంది.