ఆ బడా నిర్మాత కోసం ఒప్పుకున్న పూజ హెగ్డే..!!

Divya
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ సైతం హీరోయిన్ గా, కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉంటున్న ఒక ముద్దు గుమ్మ ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతోంది. అంతేకాకుండా స్టార్ హీరోలతో నటించేందుకు డేట్స్ అడ్జస్ట్ చేయకపోయినా.. స్పెషల్ సాంగ్ లకు మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక హీరోయిన్ ఎవరు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న f-3 చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతోంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇదివరకు కూడా రంగస్థలం సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి అందరినీ అలరించింది. ఇక f-3 సినిమాలోని పాటలకు సంబంధించి రేపటి రోజు నుండి షూటింగ్ మొదలు పెట్ట బోతున్నట్లుగా సమాచారం. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి మాత్రం తన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది పూజా హెగ్డే.. కానీ బడా నిర్మాత అయిన దిల్ రాజు అడగగానే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించేందుకు ఒప్పుకొంది ఈ ముద్దుగుమ్మ.

ఒకవైపు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.. ఇలా సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆచార్య సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతోంది పూజా హెగ్డే.f-3 సినిమాలోని పాట కోసం దాదాపుగా 1.5 కోట్ల రూపాయలు అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కూడా వచ్చే నెల 27 వ తేదీన విడుదల కాబోతోంది. ఇక పూజా హెగ్డే తో ఈ సినిమా మరింత హైప్ పెంచేలా కనిపిస్తోంది అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: