దర్శకుడు అనిల్ రావిపూడి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అనిల్ రావిపూడి సినిమా ఇండస్ట్రీలో మొదట కథారచయితగా పనిచేసినప్పటికీ కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా పటాస్ తోనే బ్లాక్బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు, ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా అనిల్ రావిపూడి మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాకు ప్రాంచేజి గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా తర్వాత బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే.
ఇది ఇలా ఉంటే అప్పట్లో అనిల్ రావిపూడి, బాలకృష్ణ 100 వ సినిమాకు దర్శకత్వం వహించడానికి చాలా కసరత్తులు చేశాడు, కాకపోతే అనిల్ రావిపూడి ప్రయత్నం ఫలించలేదు, ఆ అవకాశం క్రిష్ జాగర్లమూడి కి దక్కింది ఆ తరువాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉండటం వలన, ఈ కాంబినేషన్ సెట్ కావడానికి కాస్త ఆలస్యమైంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే వీరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది, ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ. బాలకృష్ణ గారిని ఎలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో, అలా చూపించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను అని అనిల్ రావిపూడి తెలియజేశాడు, నా మార్కు ఎంటర్టైన్ మెంట్ ను యాడ్ చేస్తాను. ఇంతకు ముందు నా మూవీ ల మాదిరిగా ఎక్కువ కామెడీని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి , అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.