బెగ్గర్ గా మారిపోయిన సంపూర్ణేష్ బాబు.. కారణం..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కామెడీతో నవ్వించగల ఏ హీరో ఎవరంటే సంపూర్ణేష్ బాబు అని చెప్పవచ్చు. మొదటిసారిగా హృదయ కాలేయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో. మొదటి సినిమాతోనే కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని చేకూర్చారు. దీంతో ఆయన్ని బర్నింగ్ స్టార్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు. అటు తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నారు సంపూర్ణేష్ బాబు. అయితే తాజాగా.. శీలో రక్షితి రక్షితః అనే ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో క్యాలీఫ్లవర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా బెగ్గర్ అనే సినిమా టైటిల్ తో ప్రేక్షకులను మరొకసారి అలరించబోతున్నారు. ఇందులో కథానాయకిగా అద్వితీ శెట్టి నటిస్తున్నది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ గా వడ్ల జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ బెగ్గర్.. వీడు చిల్లరడగడు అనే క్యాప్షన్ తో ఈ సినిమా టైటిల్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత గా గురు రాజ్, కార్తీక్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ చిత్రం కూడా సరదాగా సాగిపోయే కామెడీ చిత్రంగా తెరకెక్కిచబడుతోందని సమాచారం. ఈనెల 25వ తేదీన ఈ సినిమాకు సంబంధించి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తిచేసుకోనుంది. డైరెక్టర్ వడ్ల జనార్ధన్ అనుకున్న విధంగా తన ఈ సినిమాని ఎలాగైతే నిర్మించాలనుకున్నారో ఈ చిత్రాన్ని అలాగె నిర్మిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది. ఈ సినిమా సంపూర్ణేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని నమ్మకం తమకు ఉన్నట్లుగా తెలియజేశారు. ఏది ఏమైనా సంపూర్ణేష్ బాబు వరుసబెట్టి చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తునరని చెప్పవచ్చు.. మరి ఈ చిత్రంతో అలరిస్తారేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: