మహేష్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న సర్కారు వారి పాట!

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.ఇక అన్ని పనులు కూడా పూర్తిచేసుకుని మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మహేష్ ఊర మాస్ పాత్ర లో కనిపిస్తున్నాడని టీజర్ ఇంకా అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్లారిటీ వచ్చేసింది.మహేష్ బాబు మాస్ ఫ్యాన్స్ కి ఓ ఫీస్ట్ లాంటి సినిమాని టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్లగా రొటీన్ కి భిన్నమైన పాత్రలు పోషించిన మహేష్ బాబు ఈ సినిమాతో మహేష్ లో మాస్ యాంగిల్ ని ఆవిష్కరించబోతున్నారని ఆడియన్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ లో ప్రచురించబడిన `సర్కారు వారి పాట` సినిమా సారంశం మహేష్ అభిమానులకు ముచ్చెమటలు పట్టిస్తుంది.ఇందులో మహేష్ వడ్డీ రివకరీ ఏజెంట్ పాత్రలో నటిస్తాడని ఆ క్రమంలో ఓ సమస్య రావడంతో దాన్ని పరిష్కరించడానికి తన స్వగ్రామానికి తిరిగి వెళ్తాడని అందులో పేర్కొనబడింది. ఒకవేళ అదే నిజమైతే ఈ సినిమా మరో సందేశాత్మక సినిమా అవుతుందని అభిమానుల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటి దాకా ఫ్యాన్స్ మహేష్ ని వేరే లెవల్లో ఊహించుకున్నారు. ఇప్పుడు పోర్టల్ తో ఆ అంచనాలు అనేవి డౌన్ అవుతున్నాయి.


`శ్రీమంతుడు`..`భరత్ అనే నేను`.. మహర్షి..`సరి లేరు నీకెవ్వరు` ఇవన్నీ కూడా పూర్తిగా సందేశాత్మక చిత్రాలు. 'సర్కారు వారి పాట' కథ `మహర్షి`సినిమాని పోలి ఉందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిదే ఆలోచన సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే ఇది కేవలం పోర్ట్ సారాంశం మాత్రమేనట. అధికారికంగా యూనిట్ ఇంత వరకూ కూడా ధృవీకరించలేదు. దీంతో ఓ అభిమాని ఇదంతా ఫేక్ అని కూడా అంటున్నాడు. ఈ సారాంశం అనేది 100 శాతం ప్రామాణికంగా పరిగణించబడదు. ఎందుకంటే చాలా అస్పష్టంగా ఉంది. దీనిపై అనవసర ఆందోళన అవసరం లేదు అని ఖండించడం జరిగింది.దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూల్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కమిట్ అయినప్పుడే ఇది అందరికి రీచ్ అయ్యే సినిమా అని ఓ ఇంటర్వ్యూలో కూడా అన్నారు. ఆ పాత్ర ఎంతో ఎగ్టైట్ మెంట్ ని అందిస్తుందని ఇక అందుకే పరశురాం కథని ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. మరి వీటన్నింటికి తెర పడాలంటే మే 12 వ తేదీ వరకూ కూడా వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: