"బాలయ్య - అనిల్ రావిపూడి" కాంబోలో మూవీ ఎలా ఉంటుందో తెలుసా?
అయితే ప్రస్తుతం ఈయన ఎఫ్ 3 సినిమాను పూర్తి చేసే పనిలో లీనమై ఉన్నాడు. ఎఫ్ 2 సినిమాను గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి సందడి చేశారు. పెళ్ళాం పోరు భరించలేని భర్తలుగా తెగ నవ్వుల వర్షం కురిపించారు. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 ని తీయనున్నారు. మరి ఈ సినిమాలో సునీల్ , సోనాల్ చౌహన్ అనే ఇద్దరిని కొత్తగా యాడ్ చేశారు. అయితే ఎఫ్ 2 సినిమాకి మించిన నవ్వులు పూయించటంలో నాది గ్యారెంటీ అని ఇప్పటికే హామీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.. మరి ఇప్పుడు అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడట. అంతే కాకుండా నట సింహం బాలయ్య నుంచి కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ రాబట్టుకున్నాడు.
అయితే బాలకృష్ణ ను డైరెక్ట్ చేయాలని చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాడట అనిల్. రీసెంట్ గా బాలయ్య కూడా అఖండ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు డైరక్టర్ గోపి చంద్ మలినేని సినిమాతో రంగంలోకి వచ్చారు. మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత అనిల్ సినిమాతో సెట్ లో అడుగు పెట్టనున్నారట మన బాలయ్య బాబు. అయితే అనిల్ బాలయ్య బాబు కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో అని నందమూరి ఫ్యాన్స్ లో ఒక ప్రశ్న మొదలయింది. యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ పెట్టింది పేరు. అనిల్ తీసే సినిమాలు కామెడీ మిక్స్ చేసిన స్టోరీస్తో ఉండటం తో బాలయ్యను ఎలా చూపించనున్నాడా అని ఆలోచిస్తున్నారు.