కే జి ఎఫ్ -2 ట్విట్టర్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..!!

Divya
రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో విడుదలైన చిత్రం కే జి ఎఫ్-2 ఈ సినిమా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్రం మొదటి భాగం విడుదలై 4 సంవత్సరాలు గడుస్తున్నది. ఇక ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై విడుదలైన చోట చరిత్రను సృష్టించిందని చెప్పవచ్చు. ఈ సినిమా మాస్, యూత్ను బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ నిల్. అయితే ఇప్పుడు కే జి ఎఫ్-2 ఎలా ఉందో మనం తెలుసుకుందాం.

చిత్ర బృందం ఈ చిత్రం అంచనాలను ముందే పసిగట్టిన నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని అత్యధికంగా భారీ బడ్జెట్తో నిర్మించారు. అయితే పార్ట్-1 లో లేని ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ వంటి నటీనటులను సినిమాలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ చిత్రం అంచనాలను మించి ఖర్చు చేయడం కూడా జరిగింది. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడినది. ఇక ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇండియా లోనే అత్యధికంగా రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.

ఇక ఈ రోజున ఈ చిత్రం విడుదల కాగా అందరూ తమ ట్విట్టర్ ద్వారా అప్రిషియేట్ చేస్తున్నారు.
మొదటి భాగంలో హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక రవి బహుమతి అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారట. ఇందులో హీరో యష్ మాస్ ఎలివేషన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఆడియన్స్ తెలుపుతున్నారు.
ఇన్ని రోజులు వేచి చూసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కు తమ సమయం వృధా కాలేదని కామెంట్లో తెలుపుతున్నారు. ఇక డైరెక్టర్ పడిన కష్టం మొత్తం విచిత్రం లో కనిపిస్తోంది.
ఎట్టకేలకు ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం  కాదు ఓవర్సీస్లోనూ రాఖీ భాయ్ మరొకసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: