జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి "కేజీఎఫ్ స్టార్ యశ్" మాటల్లో?
ఇటీవలే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ స్టార్ యాంకర్ సుమతో ముచ్చటించారు. ఈ క్రమంలో యాంకర్ సుమ హీరో యశ్ ని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పమని అడుగగా.. ఈ సందర్భంగా మాట్లాడిన యశ్ ఏమన్నారు అంటే... చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గొప్ప నటులే. ఎవరికి వారే సాటి... చరణ్, తారక్‌లతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇటీవలే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిన సందర్భం గురించి చెప్పుకొచ్చారు. అలాగే తారక్ తల్లి షాలిని గారి గురించి కూడా మాట్లాడారు.
ఇంతకీ యశ్ ఏమన్నారు అంటే... తారక్ నన్ను తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించారు. దాంతో నేను డిన్నర్ కి వెళ్ళాను. తారక్ ఫ్యామిలీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి షాలిని గారు ఎంతో ప్రేమ చూపించారు, ఆమెది ఎంతో మంచి హృదయం. నన్ను కుటుంబంలో ఒక వ్యక్తిగా ట్రీట్ చేశారు, మనసుకు చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించింది. షాలిని గారిది కూడా కర్ణాటక కావడంతో మా మధ్య అనుబంధం ఏర్పడింది. ఎప్పుడూ పెదవిపై చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ కూడా చాలా మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు కూడా... హైదరాబాద్ లో నాకు షూటింగ్ ఉంది అంటే చెర్రీ హోమ్ ఫుడ్ తప్పకుండా పంపిస్తాడు అని చెప్పుకొచ్చారు యశ్.
ఇక హీరో యశ్ తాజా చిత్రం కేజీఎఫ్ 2 పాజిటివ్ టాక్ తో సంచలనం సృష్టిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రానికి తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకాఫ్ చేసిన ఈ మూవీ అంచనాలను మించిన హైప్ ను అందుకుంటోంది.