రవితేజ సెన్సేషనల్ డెసిషన్.. ఇక నుంచి ఆ రోల్స్ లో కూడా..!

Purushottham Vinay
మాస్ మహారాజ రవితేజ హిట్లు ప్లాపులతో అసలు సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇక ఈమధ్యే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మాహా రాజా. ఆ మధ్య రవితేజ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.ఇక సరిగ్గా ఆ సమయంలోనే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాతో మాంచి సాలిడ్ హిట్ కొట్టి తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ.క్రాక్ సినిమా హిట్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మాస్ రాజా ఈస్ బ్యాక్ అంటూ అనౌన్స్ కూడా చేశారు రవితేజ. ఇదే జోష్ లో వరుస సినిమాలను కూడా కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఖిలాడి సినిమాను విడుదల చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ తో హిట్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా ఇంకా అలాగే టైగర్ నాగేశ్వరావు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇక వీటితో పాటు మరికొన్ని కథలను కూడా మాస్ రాజా ఓకే చేశారని సమాచారం తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే తాజాగా మాస్ మహా రాజా రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 




ఇక పై హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలనీ నిర్ణయించుకున్నారట ఈ హీరో. ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం అనేది లేదని ఇప్పటికే దర్శకులకు కూడా రవి తేజ చెప్పేశారట. ఇదిలా ఉంటే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడని చాలా రోజుల నుంచి టాక్ అనేది వినిపిస్తుంది. అలాగే బాలకృష్ణ ఇంకా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం వినిపిస్తుంది. ఇక ఈ సపోర్టింగ్ రోల్స్ విషయంలో క్లారిటీ రావాలంటే రవితేజ స్పందించాల్సిందే..ఇక రవి తేజాతో పాటు ఒకప్పుడు స్టార్ హీరోస్ గా వెలిగిన శ్రీకాంత్, జగపతి బాబు వంటి హీరోలు కూడా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇక వారి లాగానే రవి తేజ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: