నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్!

Purushottham Vinay
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి 2 వారాలు అయ్యి 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా ఉండి వసూళ్లు రాబడుతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయిన తరువాత రామ్ చరణ్ ఫుల్ అప్డేట్ల తో తన ఫ్యాన్స్ ని ఖుషి చేయగా మా హీరో ఎన్టీఆర్ ఇంకా తన 30వ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్ ఇవ్వడంలేదేంటని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటించి దాదాపు ఏడాది పైనే అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్ డేట్ అనేది ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా వున్నారట. ఎన్టీఆర్ మాత్రం తన తరువాతి సినిమా కోసం అప్పుడే కసరత్తులు కూడా చేయడం మొదలుపెట్టాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన 30వ సినిమాని చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కినేని సుధాకర్ నిర్మించబోతున్నారు.




జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కి సరిగ్గా రెండు నెలల సమయం వుండటంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ కోసం ప్రత్యేకంగా 8 కేజీలు తగ్గడం మొదలు పెట్టారు.ఇప్పటికే ప్రత్యేక ట్రైనర్ సహాయంతో వెయిట్ తగ్గడం మొదలు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెర్రిఫిక్ మేకోవర్ లోకి ట్రాన్స్ ఫార్మ్ అయిపోయాడు. ఇక ట్రైనర్ తో కలిసి షేర్ చేసిన ఎన్టీఆర్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఫ్యాన్స్ ని వావ్ అనిపించేస్తోంది. బరువు తగ్గి మీసం గడ్డం ట్రిమ్ చేసి ఎన్టీఆర్ మాంచి టెర్రిఫిక్ లుక్ లోకి మారిన తీరు అయితే ఫ్యాన్స్ ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.ఆర్ ఆర్ ఆర్ టైమ్ లో రఫ్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త మేకోవర్ లోకి మారిపోవడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన న్యూ లుక్ ఫొటో అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: