ఆ స్టార్ హీరో కి పోటీగా సినిమాను విడుదల చేయబోతున్న కార్తికేయన్..!!

Divya
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా ఈ ఏడాది మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మహేష్ బాబు ఈ చిత్రాన్ని సోలోగా తీసుకు రావాలని చూస్తున్నారు కానీ ఇప్పుడు తాజాగా తమిళ హీరో పోటీగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరు ఆ చిత్రం ఏమిటో తెలుసుకుందాం.

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం డాన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శిబిచక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ చిత్రం మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.. కానీ rrr సినిమా విడుదల కావడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. తమిళంలో న్యూ ఇయర్ సందర్భంగా ఈ డాన్ చిత్రం విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ ఏడాది మే 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించడం జరిగింది. తెలుగులో శివకార్తికేయ రెమో, వరుణ్ డాక్టర్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు.

ఇక వీటితో పాటుగా కొన్ని చిత్రాలలో నటించి బాగానే అలరించారు. ప్రస్తుతం చిత్రాన్ని లైక ప్రొడక్షన్, శివ కార్తికేయన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా కామెడీ తో సాగే కథాంశంతో తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో ఎస్.జె.సూర్య నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో సినిమా విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. లేదంటే మరి ఏ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: