అక్కడ కూడా అదరగొట్టిన నాని 'శ్యామ్ సింగరాయ్' మూవీ..!
సాయి పల్లవి ఈ సినిమా లో దేవదాసి పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. కృతి శెట్టి ఈ సినిమా లో కాస్త బోల్డ్ గా కనిపించి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మడోనా సబాస్టియన్ నటించింది. శ్యామ్ సింగరాయ్ మూవీ కి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా మిక్కీ జే మేయర్ ఈ సినిమా కు సంగీతాన్ని సమకూర్చాడు. ఇది ఇలా ఉంటే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న శ్యామ్ సింగరాయ్ మూవీ తాజా గా జెమినీ టీవీ లో ప్రసారం అయ్యింది. జెమినీ టీవీ లో తాజాగా ప్రసారం అయిన శ్యామ్ సింగరాయ్ మూవీ 6.87 'టి ఆర్ పి' ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ లలో మంచి విజయం సాధించిన శ్యామ్ సింగరాయ్ మూవీ టీవీ లలో కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది.