చంద్రముఖి.. సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిందే తెలుసా..?

Divya
సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం చంద్రముఖి. ఇక ఈ చిత్రాన్ని మలయాళంలో మని చిత్రతాము కి రీమేక్ గా తెరకెక్కించ బడింది. ఈ చిత్రాన్ని తమిళంలో పాటుగా తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇందులో జ్యోతిక, ప్రభు లు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో జ్యోతిక నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మొదట విడుదల అయినప్పుడు ఎటువంటి అంచనాలు లేవు కానీ.. విడుదలైన తరువాత మంచి హిట్ టాక్ తో ఈ సినిమా ని చూడడానికి ప్రజలు సైతం ఎగబడ్డారు. మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంతటి కలెక్షన్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

1). నైజాం-3.46 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-3.22 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.98 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-89 లక్షల రూపాయలు.
5). వెస్ట్-81 లక్షలు రూపాయలు.
6). గుంటూరు-1.17 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.2 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు- 49 లక్షలు రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..13.4 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

చంద్రముఖి చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.9 కోట్ల  థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా ముగిసే సమయానికి రూ.13.4 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.4.04 కోట్ల లాభాలు దక్కించుకుంది ఈ సినిమా దీంతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ సినిమాగా పరిగణించవచ్చు చంద్రముఖి సినిమాకి ముందు రజనీకాంత్ నటించిన బాబా చిత్రం తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది కానీ చంద్రముఖి సినిమాతో మళ్లీ  హిట్ ట్రాక్ ను సొంతం చేసుకున్నారు రజనీకాంత్. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: