పూజా హెగ్డే లక్ యూటర్న్ తీసుకుందా !

Seetha Sailaja
డస్కీ బ్యూటీగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కు కెరియర్ ప్రారంభంలో అన్నీ వరస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. దీనితో ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడగలదా అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి. అయితే దీనికితోడు ఆమె అప్పట్లో హిందీలో చేసిన ‘మొహెంజదారో’ ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలతో పాటు తమిళంలో తెలుగులో నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లు అయ్యాయి.


అయితే ఆతరువాత ఆమె అల్లు అర్జున్ తో కలిసి నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ తో ఆమెకు అదృష్టం కలిసివచ్చి ‘అల వైకుంఠ పురంలో’ మూవీతో ఆమె కెరియర్ పీక్ కు చేరుకుంది. దీనితో పూజా హెగ్డే ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది అంటు ఆమె పై విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. దీనికితోడు ఆమె పారితోషిక స్థాయి కూడ 3 కోట్ల స్థాయికి చేరడంతో ఆమె దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ ఆనందం పూజా హెగ్డే కు ఎక్కువ కాలం నిలవలేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


దీనికికారణం అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ ‘రాథే శ్యామ్’ ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీనితో షాక్ కు గురైన పూజా సినిమాలకు కూడ జాతకాలు ఉంటాయి అంటూ భావోద్వేగంతో స్పందించింది. ఈ ఫెయిల్యూర్ తరువాత పూజ విజయ్ తో నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా పై చాల ఆశలు పెట్టుకుంది. అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ విజయ్ అభిమానులకు కూడ బాగా నచ్చకపోవడంతో ఆమూవీ పూజా ఫెయిల్యూర్ మూవీల లిస్టులో చేరిపోయింది.


దీనికితోడు దక్షిణాది సినిమా రంగంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడ రష్మిక తో చాల ఎక్కువగా పోటీ పడవలసిన పరిస్థితి పూజకు ఏర్పడింది. దీనితో తనకు గురువు లా మారిన త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తో నటించబోయే సినిమా పైనే ఆమె ఆశలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీని చేసే అవకాశం ఆమెకు ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో మరొక ఫ్లాప్ రాకుండా ఆమె తన కెరియర్ ను ప్లాన్ చేసుకోవలసిన అవసరం ఉంది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: