టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య మరియు సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే వారు మళ్లీ కలిస్తే బాగుండని, అసలు వారు విడిపోకుండా ఉండాల్సిందని భావించే వారు చాలా మంది ఉన్నారు.ఇకపోతే వారిరువురు వివాహ బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్ గా కలిసే ఉంటామని ఇన్ స్టా పోస్టులో పేర్కొన్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం వీరిద్దరూ.. విడిపోయి సంతోషంగా ఉంటున్నారు. అయితే అటు సమంత, ఇటు నాగ్ చైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం నాగ్ చైతన్య.. ఓ స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడని సమాచారం అందుతోంది.ఇకపోతే ఇప్పటికే వారిద్దరి విషయం నాగార్జునకు కూడా తెలిసిందట. అయితే దీనికి నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే అటు అఖిల్ కు కూడా పెళ్లి సంబంధాలు చూస్తుందట అక్కినేని ఫ్యామిలీ. కాగా అన్ని ఒకే అయితే… నాగ్ చైతన్య, అఖిల్ కు ఇద్దరికి కలిసి..ఒకే సారి పెళ్లి చేయాలని నాగార్జున ప్లాన్ చేశాడని సమాచారం అందుతోంది.అయితే నిజంగా ఇదే జరిగితే.. సమంత కు షాక్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే... ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ప్రస్తుతం 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా విక్రమ్ కె కుమార్ తో మరోసారి వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి దూత అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలతో పాటు తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన ఇరవై రెండో సినిమాను కూడా అధికారికంగా ప్రకటించాడు నాగచైతన్య..!!