స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన డీజే సినిమా పూజా హెగ్డే కెరీర్ ని తెలుగులో ఓ రేంజ్ లో మలుపు తిప్పేసింది. సక్పెస్ ఫెల్యూర్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లు పూజాకు వచ్చాయి. తెలుగలో ఇంత క్రేజ్ వున్నా ఆ మధ్య కొన్ని సినిమాలకు పూజా హెగ్డే అంగీకరించిన తరువాత షాకిచ్చింది. డేట్స్ సమస్య అంటూ పూజా తప్పుకుని మళ్లీ చివరి నిమిషంలో ఓకే చెప్పేసింది. అయినా సరే మన వాళ్లు ఇంకా పూజా హెగ్డేనే కావాలంటూ వెంటపడుతున్నారు.ఇదిలా వుంటే పూజా హెగ్డే ని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో తెగ ట్రోల్ చేస్తున్నారు. పూజా హెగ్డే మరోసారి ఐటమ్ సాంగ్ చేస్తోందంటూ నెట్టింట పూజను ఏకి పారేస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ తో కలిసి పూజా 'బీస్ట్' సినిమాలో నటించింది. ఏప్రిల్ 13 వ తేదీన ఈ సినిమా విడుదలై ఘోరమైన ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇక ఇదిలా వుంటే తాజాగా పూజా హెగ్డే 'ఎఫ్ 3' సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ పాట కోసం భారీగానే పారితోషికం డిమాండ్ చేసిన పూజా హెగ్డే శుక్రవారం నుంచి సాంగ్ షూటింగ్ లో పాల్గొంటోంది.
విక్టరీ వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ లతో కలిసి పూజా ఐటమ్ సాంగ్ చేస్తున్న ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. ఈ షొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్ లు పూజా థర్డ్ ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. అదెలా అంటే 'రంగస్థలం'లో చేసిన ఐటమ్ పాట మొదటిదని 'బీస్ట్'లో చేసిర అరబ్బిక్ కుత్తు పాట రెండవదని ఇక 'ఎఫ్ 3' లో చేస్తున్న పాట మూడవదని చమత్కరిస్తూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.ఈ సినిమా సమయంలో మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి డేట్స్ సమస్య తలెత్తినట్టుగా ఇగ్నోర్ చేసిన పూజా హెగ్డే ఆ తరువాత మళ్లీ మహేష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పూజా హెగ్డే తాజాగా 'ఎఫ్ 3' సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రాధేశ్యామ్ బీస్ట్ సినిమాలే కారణమని చెబుతున్నారు. ఈ రెండు భారీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ ఫ్లాప్ కావడంతో ఆ దృష్టిని మళ్లించడానికే సమంత తరహాలో స్పెషల్ సాంగ్ కు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నెట్టింట అనేక రకాల కామెంట్ లు వినిపిస్తున్నాయి.