సూపర్ స్టార్ భార్య నమ్రత శిరోద్కర్ ప్రతి ఒక్కరికి తెలుసు.. అమృత వివాహమైన కూడా బాలీవుడ్ లో ఉండే ప్రముఖులతో చాలా సనిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ని నమ్రత లంచ్ తో ఆమె బేటీ అవ్వడం జరిగింది. ఇద్దరూ కలిసి అందమైన జ్ఞాపకాలను పంచుకుంటూ తమ మధురమైన క్షణాలను పంచుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నమ్రత తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. గౌరీ ఖాన్ తో కలిసి ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.
అనుకోని విధంగా ఫన్ లంచ్ గౌరీ ఖాన్ హౌస్ లో జరిగిందని నమ్రత తెలియజేసింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మేమిద్దరం ఇలా కలిసాము. లంచ్ పూర్తయిన తర్వాత తన జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ చాలా నవ్వుకున్నాము అని తెలియజేసింది. గౌరీ మీరు ఎప్పటిలాగానే మెరుస్తూ ఉండండి అంటూ తెలుపు కు వచ్చింది నమ్రత. ఇద్దరు స్టార్ వైఫ్స్ కలిసి ఉన్న ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నారు అని చెప్పవచ్చు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టింది నమ్రత. అయినప్పటికీ కూడా ఇప్పటికీ తమ స్నేహితులతో చాలా స్నేహంగా ఉంటోంది.
ఇక షారుక్ ఖాన్, మహేష్ బాబు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉందని చెప్పవచ్చు. గతంలో కూడా బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో మహేష్ దంపతులతో షారుక్ ఖాన్ కలిసి ఉండడం జరిగింది. నమ్రత ప్రస్తుతం మహేష్ బిజినెస్ వ్యవహారాలు మాత్రం చూసుకుంటూ తనకు సపోర్టుగా నిలుస్తోంది. ఇక అడవి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న మేజర్ చిత్రానికి నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యారు మహేష్ బాబు. ఈ సినిమా కథను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా మే 27న విడుదల కాబోతోంది.