దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు మంచి క్రేజ్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది ఒక సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అతి తక్కువ సమయంలోనే నేషనల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు నేషనల్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మికా మందన్న. తన అందం , అభినయంతో కుర్రకారును ఆకట్టుకోవడమే కాకుండా చలాకీతనంతో ప్రేక్షకులను మెప్పించింది.
ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో శ్రీవల్లి గా అదరగొట్టేసింది అని చెప్పవచ్చు. ఇక తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక.. అఫ్రీన్ అనే ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో మనకు కనిపించడం గమనార్హం. ఇకపోతే కర్ణాటకలోని కొడుగు జిల్లా లో ఉన్న విరాజ్ పేట లో ఏప్రిల్ 5 1996 లో జన్మించిన రష్మికా మందన్న కూర్గ్ పబ్లిక్ స్కూల్లో తన చదువును పూర్తి చేసింది. ఆ తర్వాత ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం , ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు కూడా సంపాదించుకుంది. తెలుగులో గీతగోవిందం అనే సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన ఈమె ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమా లో అదరగొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి తిరుగులేకుండా చేసుకుంది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా చలామణి అవుతూ బిజీ హీరోయిన్గా తన కెరీర్ ను గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: