దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.ఇకపోతే ఈ సినిమా తాజాగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా ఏకంగా రూ.1050 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సౌత్ నుంచి బాలీవుడ్ దాకా అందరూ కొనియాడారు.అంతేకాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఈ సినిమాపై ఆలస్యంగా స్పందించాడు.ఇదిలా వుండగా తాజాగా ఇప్పుడు ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
'నేను ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాను. చాలా బాగా నచ్చింది.దీనితోపాటు దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది ఒకటి. అంతేకాదు ఆర్ఆర్ఆర్ రూ.1100 కోట్లు సాధించే దిశగా వెళ్తోంది. ఇకపోతే ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చింది. అయితే దాదాపు 10 సన్నివేశాల్లో నా కళ్లలో నీళ్లు తిరగ్గా... 50 సీన్లు నన్ను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమా చాలా బాగుంది' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దీంతో త్రిబుల్ ఆర్ సినిమా పై ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే..
ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాల్లో సలార్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి మే మొదటివారం లో టీజర్ విడుదల కాబోతోంది. ఈ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే పాన్ వరల్డ్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్..!!