సూపర్ స్టార్ సినిమాలో మరొక స్టార్ హీరో ..!!
ఇందులో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలోనూ కీలకమైన పాత్రలో అలనాటి స్టార్ హీరో శరత్ కుమార్ ను కూడా ఎంపిక చేయడం జరిగింది. శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక అప్పట్లో హీరోగా నటించిన సినిమాలు తెలుగులో మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అందుచేతనే ఈ హీరో అటు తమిళ ప్రేక్షకులకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు అయ్యారు. అయితే విజయ్ సినిమా లో హీరో ని కూడా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరో విజయ్ శరత్ కుమార్ కాంబినేషన్లో చిత్రం అనగానే తమిళ ప్రేక్షకుల లో చాలా ఆసక్తి నెలకొంది.
ఈ అరుదైన కాంబినేషన్ కోసం తమిళ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. విజయ్ కి తండ్రి పాత్రలో హీరో శరత్ కుమార్ కనిపించబోతున్నట్లు గా సమాచారం. ఇక తాజాగా విజయ్ నుంచి వచ్చిన బీస్ట్ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినట్లు గా తెలుస్తోంది. అయినా కూడా కలెక్షన్ల పరంగా బాగానే కొల్లగొట్టి నట్లు గా సమాచారం. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.