బిగ్ బాస్ రియాల్టీ షో లు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, బిగ్ బాస్ రియాల్టీ షో కు ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. భారత దేశంలో మొదట హిందీ లో ప్రారంభమైన బిగ్ బాస్ రియాల్టీ షో కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం భారతదేశం లోని చాలా భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో టెలికాస్ట్ అవుతుంది. అందులో భాగంగా తెలుగు లో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే విజయవంతంగా అయిదు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని వారాల క్రితమే బిగ్ బాస్ 'ఓ టి టి' తెలుగు నాన్ స్టాప్ ను ప్రారంభించారు. 17 మంది తో ప్రారంభం అయిన బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' రియాలిటీ షో లో ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారు. ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' లో నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.
ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేశ్ విట్టా నామినేషన్ లలో ఉండగా వీరిలో నుంచి మహేష్ బిగ్ బాస్ 'ఓ టి టి' నుంచి ఎలిమినేషన్ అవబోతున్నాడు అంటూ నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ 'ఓ టి టి' తెలుగు కి సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ 'ఓ టి టి' లో కొట్లాటలు తప్ప పెద్దగా కామెడీ లేకుండా పోవడంతో బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బిగ్ బాస్ మూడవ సీజన్ లో బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది.