'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ పాత్ర పై కఠినంగా వ్యవహరిస్తున్న కొరటాల శివ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  ఆచార్య సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటె ఆచార్య సినిమా విడుదల తేది దగ్గర పడటం తో చిత్ర బృందం ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇటీవలే విడుదల చేసిన ఆచార్య సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.


ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర చాలా కీలకం అని ఎన్నో రోజుల నుంచి సినీ వర్గాల నుండి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్తకు తగ్గట్టుగానే ఇటీవల విడుదల చేసిన ఆచార్య సినిమా ట్రైలర్ లో ఎక్కువ శాతం చిరంజీవి,  రామ్ చరణ్ లకు సంబంధించిన సన్నివేశాలనే చూపించారు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు ఆచార్య సినిమాలో చాలా లేంతి  గా ఉండడంతో ఈ సన్నివేశాల లెన్త్ ను కొరటాల శివ తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.  ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.  ఈ నెల 18 వ తేదీన ఆచార్య సినిమా నుండి 'భలే భలే బంజారా'  అనే సాంగ్ విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: