శ్రీ లీల ను అందుకోవడం ఎవరి తరం కాదట..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా చాలా మంది పరిచయం అవుతున్నారు. అయితే వారు అగ్ర హీరోయిన్ గా ఎదగక పోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.అందం అభినయంతో ఆలరించినా కూడా ఆవగింజంత అదృష్టం కలిసి రాక వారు మధ్యలోనే తమ కెరీర్ను ముగించవలసి వస్తుంది. ఆ విధంగా టాలీవుడ్ లో అందం అభినయంతో పాటు అదృష్టం కూడా కలుపుకొని ఇప్పుడు అగ్రహీరోయిన్ గా ఎదగడానికి సిద్ధమౌతుంది శ్రీ లీల. పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ చిత్రం ఈమెకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. మేస్మరైజ్ చేసే గ్లామర్ తో ఎంతో మంది యువకులను ఆకట్టుకుంది. ఆ విధంగా తొలి సినిమాతోనే అందరి హృదయాలను కొల్లగొట్టి పెద్ద దర్శక నిర్మాతల దృష్టిలో పడి ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. తెలుగులో మీడియం రేంజ్, డెబ్యూ హీరోలకు ఈమె హీరోయిన్ గా మారిపోయింది అంటే ఏ స్థాయిలో ఆమెకు క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా తనకు ఉన్న డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ కూడా పెంచి రెండు చేతులా సంపాదిస్తుంది.

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ పోలిశెట్టి సరసన ఓ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అంతే కాదు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు హీరో గా పరిచయం అవుతున్న సినిమాలో సైతం ఈమెను హీరోయిన్ గా తీసుకున్నారు. నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికరికంగా ప్రకటించారు. అలాగే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈమె రెండో హీరోయిన్ గా నటిస్తుంది అని అంటున్నారు. ఈ విధంగా చిన్న పెద్ద హీరోలందరితో కలిసి నటిస్తూ ఈ ఏడాది ఫుల్ బిజీగా ఉంది శ్రీ లీల. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: