శృతిహాసన్ వాడేసిన దుస్తులతో చేసే పని ఎంటో తెలుసా..?

Divya
[సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్ కూతురు గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదటగా సిద్ధార్థ హీరోగా వచ్చిన అనగనగా ఒక ధీరుడు చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తరువాత వెంటనే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ ఖాతాను వేసుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ దశ మారిపోయింది అని చెప్పవచ్చు. ఇక వీటితోపాటుగా అటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తనదైన మార్కును సంపాదించుకుంది. అలా కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో శృతిహాసన్ అనుకోని విధంగా షాక్ తగిలిందని చెప్పవచ్చు.

లండన్లో మైఖేల్ అనే వ్యక్తి తో కొద్ది రోజులు ప్రేమాయణం నడిపింది. అయితే ఇక తననే వివాహం చేసుకోబోతోంది అని పలు మీడియాలో కూడా వార్తలు బాగా వినిపించాయి. అయితే కొన్ని విభేదాల కారణంగా చివరకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఈ బ్రేకప్ వల్ల తను చాల డిప్రెషన్ కు గురైనట్లుగా వార్తలు కూడా వినిపించాయి శృతిహాసన్ మీద. ఆ తర్వాత తిరిగి మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టి ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో కూడా తరుచు యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియాలో తను ఉపయోగించిన దుస్తులను ఏం చేస్తుందో తెలియజేసింది. ఎవరైనా సెలబ్రిటీస్ ఒకసారి వాడిన దుస్తులను తిరిగి వాడరు. కానీ అలా వాడిన దుస్తులను పక్కకి పడేయకుండా వాటితో మనీ సంపాదిస్తోంది శృతిహాసన్. అయితే ఆ డబ్బులను తన ఉపయోగించుకోకుండా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తానని తెలియజేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోల చిత్రాల లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: