సుకుమార్ ఆకస్మిక అమెరికా ప్రయాణం పై చర్చలు !

Seetha Sailaja

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ హడావిడిగా అమెరికా వెళ్ళడం ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి టాప్ సెలెబ్రెటీలు విదేశాలకు వెళ్ళడం పరిపాటి. కానీ సుకుమార్ ఇప్పుడు హడావిడిగా అమెరికా వెళ్ళడం కొందరికి ఆశ్చర్యపడటానికి ఒక కారణం ఉంది. ఈమధ్యనే సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సినిమా రైటింగ్స్ బ్యానర్ పై తీయబోతున్న మూవీ ప్రారంభోత్సవానికి కూడ వెళ్ళకుండా అంత హడావిడిగా అమెరికా ఎందుకు వెళ్ళాడు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.


సుకుమార్ అమెరికా ప్రయాణం పై రకరకాల గాసిప్పులు కూడ వినిపిస్తున్నాయి. సుకుమార్ అమెరికా వెళ్ళే ముందు ఉదయం ‘కేజీ ఎఫ్ 2’ సినిమా చూసాడట. ఆమూవీలోని భారీతనం విజువల్స్ టేకింగ్ సుకుమార్ కు విపరీతంగా నచ్చడమే కాకుండా సుకుమార్ కు కూడ షాక్ ఇచ్చే విధంగా ఆమూవీ ఉంది అంటున్నారు.




ఈసమయంలో ‘పుష్ప 2’ ను తీస్తే ‘కేజీ ఎఫ్ 2’ స్థాయిని మించి తీయాలని భావించిన సుకుమార్ ఒక ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ సీన్స్ ఎక్స్పర్ట్ తో చర్చించడానికి సుకుమార్ అమెరికా వెళ్ళాడు అంటూ మరికొందరు అంటున్నారు. మరికొందరైతే ‘కేజీ ఎఫ్ 2’ చూసిన తరువాత సుకుమార్ ‘పుష్ప 2’ స్క్రిప్ట్ ఐడియాలు మారిపోయాయని అందుకే ప్రశాంతంగా ఆలోచించుకునేందుకు సుకుమార్ అమెరికా వెళ్ళాడు అంటూ మరొక వాదం తెర పై తీసుకు వస్తున్నారు.


ఇది ఇలా ఉండగా మేధావి వర్గం బాగా ఇష్టపడే ఒక దర్శకుడు నిన్న ‘కేజీ ఎఫ్ 2’ ను చూసి ఈసినిమా మరో 5 నిముషాలలో ముగిసిపోతుందనగా బయటకు వచ్చేసిన పరిస్థితులలో తనకు ఎదురు పడ్డ ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఈసినిమాలో పెద్దగా ఏముంది అంటూ కామెంట్స్ చేసి వెళ్ళిపోయాడు అంటూ గాసిప్పుల హడావిడి జరుగుతోంది. దీనితో ‘కేజీ ఎఫ్ 2’ ఘన విజయం హూసి చాలామంది దర్శకులు ఈర్ష్య పడుతున్నారా అంటూ మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: