'ఎఫ్ 2' మూవీ సెకండ్ లిరికల్ సాంగ్ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 3 మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎఫ్ 3 మూవీ సూపర్ హిట్ విజయం సాధించిన ఎఫ్ 2 సినిమాకు  ఫ్రాంచేజి గా తెరకెక్కుతోంది. ఎఫ్ 2 సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ద్వారా వారి మధ్య ఏర్పడే సన్నివేశాలను కామెడీ యాంగిల్ లో చూపిస్తూ వెండి తెరపై  నవ్వులు పూయించాడు. ఇలా ఎఫ్ 2 సినిమాలో భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలను కామెడీ యాంగిల్ లో చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో డబ్బు చుట్టూ కామెడీ ని చూపించినూనెట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.


  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేస్తూ వస్తోంది.  అందులో భాగంగా చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుండి రెండవ లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఇప్పటికే ఎఫ్ 3 సినిమా నుండ చిత్ర బృందం ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది.  ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.  తాజాగా ఎఫ్ 3 సినిమా నుండి 'వో ఆఆ  ఆహా ఆహా'  అనే రెండవ లిరికల్ సాంగ్ ను ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా తెలియజేసింది.  ఎఫ్ 3 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: