రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ రోజు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసిన ఐదు సినిమాలు..!

Pulgam Srinivas
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు, స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలకు,  అలాగే జనాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాలకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్ లు రావడం అనేది చాలా సర్వసాధారణం.  కాని కొన్ని సినిమాలకు మొదటి రోజు తర్వాత కూడా మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లబిస్తూ  ఉంటాయి.  సినిమా విడుదలైన నాలగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన అయిదు సినిమాల గురించి తెలుసుకుందాం.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలైన నాలగవ  రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 17. 73 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.


బాహుబలి 2 : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా విడుదలైన నాలగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 14.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

 
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో సినిమా విడుదలైన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 11.56 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.


కే జి ఎఫ్ చాప్టర్  2 : యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన తెలుగు డబ్డ్ మూవీ 'కే జి ఎఫ్ చాప్టర్ 2'  విడుదలైన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 10.81 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.

 
సాహో : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజిత దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా విడుదలైన నాలగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 9.60 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: