సూపర్ స్టార్ మహేష్ బాబు "భరత్ అను నేను", "మహర్షి", "సరిలేరు నీకెవ్వరూ" లాంటి బ్యాక్ టూ బ్యాక్ మూడు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత చేస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది. పాండమిక్ కారణంగా షూటింగ్ వాయిదా పడటం ఇంకా మహేష్ బాబుకి మధ్యలో కరోనా రావడం అలాగే కాలికి గాయం కావడం లాంటి కారణాల వల్ల ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. చివరకి ఈ సంవత్సరం మే 12 వ తేదీన విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.అయితే ఇంకా ఒక నెలలో రాబోతున్న ఈ సినిమా అప్ డేట్స్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు.షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఇంకా కొన్ని ఆన్ సెట్స్ చిత్రాలన్ని త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో మేకర్స్ పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. 'వరస్ట్ టీమ్ ఎస్ వీపీ' అంటూ ట్విటర్ వేదికగా వారిని ట్రోల్ చేసి ట్రెండింగ్లో నిలిచేలా చేసారు.
మూడు వారాల వ్యవధిలో సినిమా విడుదల ఉంది. ఇంకా టీజర్,పాటలు అలాగే ట్రైలర్ రిలీజ్ కాలేదు. ఇంకా బీటీఎస్ సినిమాలు ఇస్తామని చెబుతున్నారు. మేము ఏమైనా పిచ్చోళ్లలా కనిపిస్తున్నామ? అని మహేష్ అబిమాని ఒకరు తన ఆవేదనని కూడా వ్యక్తం చేసాడు.అయితే ఇక ఇక్కడే ఓ సందర్భంగా ఓ విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ''నా సినిమా నచ్చకపోతే నా అభిమానులే అసలు సినిమా చూడరని.. ఇలాంటి జెన్యూన్ అభిమానులు నాకు మాత్రమే'' ఉంటారని పొగిడారు. ఆయన చెప్పింది నిజమే అనడానికి ఇదొరక రకమైన ఉదాహరణగా ఖచ్చితంగా తెలుస్తుంది.
కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ లో ఇలాంటి నిజాయితీ కనిపించదు. ఆ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా పసిగట్టారు.అయితే ఫ్యాన్స్ తమ హీరో సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వట్లేదని కోపంతో ఇలా సర్కారు వారి పాట టీం పై విరుచుకుపడుతున్నారు.అలాగే ఇక ఎన్టీఆర్ 30వ సినిమా అధికారిక పోస్టర్ రిలీజ్ చేయాలని ఆయన ఫ్యాన్స్ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అప్ డేట్స్ ఇవ్వడంలో నిజాయితీ కనిపించలేదని ఇంకా ఇన్నాళ్లు ఓపిక పట్టి ఇప్పుడు ఓపెన్ అవుతున్నామని తారక్ అభిమాను ఒకరు ఏంటి ఈ నిర్లక్ష్యం అని టీంని ప్రశ్నించారు.