ఫస్ట్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే యంగ్ బ్యూటీ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. వరుసగా ఛాన్సులు అందుకుంటూ అందరి కళ్లని కూడా తనవైపుకి తిప్పుకుంటుంది. `ఏజెంట్`సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ నే రౌండప్ చేస్తున్నట్లు ఈ బ్యూటీ కనిపిస్తుంది.`ఏజెంట్` సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అప్పుడే ఈ బ్యూటీని మెగా ఆఫర్లు వరించినట్లు కనిపిస్తుంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఓ సినిమాకి హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం తెలుస్తుంది. అలాగే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన కూడా ఈమె ఛాన్స్ అందుకుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఈ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ `ఏజెంట్` భామకి అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? అసలు ఈ భామ ఎక్కడ నుంచి వచ్చింది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇక ఆమె పేరు సాక్షి వైద్య. మోడల్ గా తన కెరీ్ర ప్రారంభించింది.పలు యాడ్స్ కూడా చేసింది. అవి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దృష్టిలో పడ్డాయి. దీంతో ఆమె వివరాలు తెలుసుకొని ఫోటో సెషన్ నిర్వహించి `ఏజెంట్ `లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. లీక్డ్ ఫోటోలతోనే హాట్ భామగా బాగా ఫేమస్ అవుతుంది. ఈ హాట్ బ్యూటీ ఎత్తు ఇంకా బరువు టాలీవుడ్ హీరోలకు పక్కాగా మ్యాచ్ అవుతుంది.
అందం..అభినయంగల హీరోయిన్. అందుకే మూవీ మేకర్స్ అమెని రౌండప్ చేసినట్లు కనిపిస్తుంది.ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఏదైనా అమ్మడి ఫేట్ని డిసైడ్ చేసేది కేవలం సక్సెస్ మాత్రమే. `ఏజెంట్` సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు నెలలో రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇదొక స్పై థ్రిల్లర్ సినిమా . రొమాంటిక్ సన్నివేశాలకు కూడా ఆస్కారం ఉంది. సూరి సినిమాలో వాటికి ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుంది.మరి అఖిల్ తో రొమాన్స్ స్థాయి తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలంటే ట్యాంలెంట్ తో పాటు కొన్ని క్వాలిటీస్ కూడా తప్పనిసరి. అసలే ఇది పోటీ పరిశ్రమ. రోజుకొక భామ ఎంటర్ అవుతుంది. వాళ్లని తట్టుకుని నిలబడటం అంటే అసలు చిన్న విషయం కాదు. ఖచ్చితంగా మల్టీ ట్యాలెంట్ అయి ఉండాలి. ఇక సాక్షి వైద్య లో అడిషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అన్నది ఇంకా తెలియాలి. సాక్షి ముంబైలో పుట్టి పెరిగి అక్కడే మోడలింగ్ చేసింది. తన చదువు పూర్తయిన వెంటనే ఈ గ్లామర్ ఫీల్డ్ లోకి దిగింది