వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్న 'వలిమై'..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  తమిళ స్టార్ హీరో అజిత్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విజయవంతమైన సినిమా లలో నటించి ప్రస్తుతం కూడా తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.  ఇలా తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న అజిత్ తాను నటించిన అనేక సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు.  తాను నటించిన అనేక సినిమా లను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అజిత్ తాజా గా నటించిన వలిమై సినిమాను కూడా తెలుగులో విడుదల చేశాడు. వలిమై మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.


ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర లో నటించాడు.  ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన వలిమై సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ ను మినహాయిస్తే ఇతర చోట్ల పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.  టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.  ఇలా ప్రేక్షకుల అంచనాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయిన వలిమై సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.  అజిత్ హీరో గా తెరకెక్కిన వలిమై మూవీ ఏప్రిల్ 24 వ తేదీన సాయంత్రం 5.30 నిమిషాలకు జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతోంది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినా వలిమై మూవీ మరి కొద్ది రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: