బిగ్ బాస్ రియాల్టీ షో కు ప్రేక్షకుల్లో ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట భారత దేశంలో హిందీ లో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో ఆ తర్వాత దేశంలోని అనేక భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ను ప్రారంభించారు. అందులో భాగంగా బిగ్ బాస్ రియాల్టీ షో ను తెలుగు లో కూడా ప్రారంభించారు. తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇలా బిగ్ బాస్ రియాల్టీ షో కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో కొన్ని వారాల క్రితమే తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో 'ఓ టి టి' ని ప్రారంభించారు. బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' రియాలిటీ షో కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' రసవత్తరంగా జరుగుతోంది.
బిగ్ బాస్ లో అన్ని రోజులు ఒక ఒకెత్తు అయితే, నామినేషన్స్ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఉన్న రోజు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటి వరకు కలిసి మెలసి హౌస్ లో ఉన్న వాళ్ళు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అంటే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటారు. ఇది ఇలా ఉంటే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ లో ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ వారం తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' లో అఖిల్, అషూ, అజయ్, అనిల్, హమీదా, బిందు నామినేషన్ లలో నిలిచారు. మరి ఈ వారం నామినేషన్ లో నిలిచిన వారిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్తారో తెలియాలి అంటే ఈ వారం చివరి వరకు వేచి చూడాల్సిందే.