గని సినిమా దెబ్బకు రంగంలోకి దిగిన చిరు.. కారణం..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నారు చిరంజీవి , రామ్ చరణ్. అయితే ఇటీవల ఈ చిత్రం కోసం ఇద్దరి పై చిత్రీకరించిన ఒక వీడియో లిరికల్ ఈనెల 18న విడుదల చేయగా అది చాలా పాపులర్ గా మారింది. అయితే ప్రస్తుతం చిరంజీవి తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్ల ను తనకు ఒక కమర్షియల్ కథ కావాలని అడుగుతున్నారట.. ప్రస్తుతం చిరంజీవి ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒక చిత్రం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇక మెహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్, బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య, బోళా శంకర్, యువ డైరెక్టర్ వెంకీ కుడుముల తో ఒక సినిమాని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇదంతా ఇలా ఉండగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఇప్పుడు కమర్షియల్ కథ  ఎందుకు అని అడుగుతున్నారు .. ఈ విషయంపై పెద్దగా ఆసక్తి రేపుతోంది. అయితే ఈ స్టోరీ చిరంజీవి కోసం కాదంట వరుణ్ తేజ్ కోసం అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ కు ఒక కమర్షియల్ చిత్రం కనుక పడితే తన రేంజ్ వేరేగా ఉంటుంది అని ఆలోచించి చిరంజీవి ఇప్పుడు ఆ సినిమా కథ కోసం వెతుకుతున్నాడు.
కానీ రీసెంట్ గా విడుదలైన గని చిత్రం భారీగా నిరాశపరిచిన ట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వరుణ్తేజ్ మార్కెట్ ని కూడా పూర్తిగా చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయం చిరంజీవి దాకా వెళ్లడంతో దీంతో వరుణ్ కెరియర్ మళ్లీ గాడిలో పెట్టడం కోసమే చిరంజీవి ఇలా కమర్షియల్ కాదని వెతుకుతున్నాడు అన్నట్లుగా సమాచారం. అయితే గని సినిమాకి సంబంధించి ఏ విషయం కూడా చిరంజీవి ఇన్వాల్వ్ కాలేదు కానీ మొత్తం బాధ్యతలన్నీ అల్లు వారే చూసుకున్నారు.. దీని ఫలితం బెడిసికొట్టడంతో వరుణ్ తేజ్ కు ఒక హిట్టు కావాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: