ప్రభాస్ రంగంలోకి దిగాడు.. ఇక మోతే..!!

P.Nishanth Kumar
రాధే శ్యామ్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన నేపథ్యంలో ప్రభాస్ పై ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు చేసిన సాహో సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. ప్రభాస్ అభిమానులు కోరుకునే విజయాన్ని ఈ రెండు సినిమాలు లేకపోవడంతో వెంటనే ఆయన ఓ భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన అభిమానులకు అందించాల్సిన ఒత్తిడి ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలని భావించి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.

కేజిఎఫ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో కేజీఎఫ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాని రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు ప్రభాస్ జోడీగా శృతిహాసన్ నటించిన జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం దాదాపు 40 శాతం షూటింగ్ను పూర్తి చేసుకోగా మిగిలిన భాగాన్ని త్వరత్వరగా చేయాలని ఆయన భావిస్తున్నారు.

 గత కొద్దిరోజుల నుంచి కే జి ఎఫ్ సినిమా తో బిజీగా ఉన్న ప్రశాంత్ ఇప్పుడు అయిపోవడంతో ఈ సినిమాపై పూర్తిస్థాయి దృష్టి పెట్టనున్నాడు ఇంకొకవైపు కూడా ఫ్లాప్ నుంచి ఇప్పుడిప్పుడే సినిమాలను చేయడానికి మొగ్గు చూపుతున్నాడు ఈ నేపథ్యంలో రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాను మే మొదటివారం నుంచి హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారు ప్రభాస్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మే ఫస్ట్ వీక్ లోనే ఆయన ఈ సినిమాను మొదలు పెట్టి త్వరలోనే పూర్తి చేస్తాడని అంటున్నారు ఈ షెడ్యూల్ కంటిన్యూగా చేసి మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారట సరికొత్త కథతో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: